జలసౌధలో ముగిసిన ఇంజనీర్ల సమావేశం

byసూర్య | Thu, Oct 10, 2019, 07:27 PM

ఏపీ, తెలంగాణకు చెందిన కృష్ణానది పరివాహక ప్రాజెక్టుల ఇంజనీర్ల సమావేశం జలసౌధలో ముగిసింది. ఈ సమావేశంలో ఇప్పటివరకు వాడుకున్న నీటి వినియోగం, యసంగికి అవసరమయ్యే నీటి పంపకాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా నాలుగు ప్రధాన అంశాల పై చర్చ జరిగింది. అవి.. పోతిరెడ్డిపాడు, కేసి కెనాల్, ఎన్సీపీ లెఫ్ట్ కెనాల్, కేడీస్ ఈ నాలుగు ప్రాజెక్ట్ ల నుండి కేటాయింపుల కంటే ఏపీ ఎక్కువ నీటిని వాడుకున్నారు అని తెలంగాణ వాదన.. దీనిపై ఏపీ ఇరిగేషన్ అధికారులు ఎన్సీపీ లెఫ్ట్ కెనాల్ మినహా మిగతా ప్రాజెక్ట్ ల విషయంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారుల వాదన తో ఏకీభవావించలేదు. 15 వ తేదీన ఇఎన్సీల సమావేశంలో తేల్చుకోవాలని ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల అభిప్రాయం పడ్డారు. 15 వ తేదిన జరిగే సమావేశం లో వర్కింగ్ మాన్యువల్ పై చర్చ జరుగనుంది. యాసంగికి కావలసిన నీటి సరఫరాను నవంబర్ వరకు 150 టీఎంసీల నీటిని విడుదల చెయ్యాలని ఏపీ కోరింది. తెలంగాణ వారు 79 టీఎంసీల నీరు కావాలని కోరారు. రేపు నీటి కేటాయింపుల రిలీజ్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM