వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో వర్ష సూచన

byసూర్య | Tue, Aug 20, 2019, 09:44 AM

 వచ్చే 48 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తర జార్ఖండ్ దానిని ఆనుకొని ఉన్న బీహార్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీంతోపాటు ఉత్తర, కోస్తా తమిళనాడు దాని పరిసరాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం వల్ల రుతుపవనాలు కొంత చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అదేవిధంగా వచ్చే 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలిపారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM