పనుల్లో వేగం పెంచాలి : సీఎం కేసీఆర్

byసూర్య | Sat, Aug 17, 2019, 09:21 PM

యాదాద్రి ఆలయం పునర్ నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం పనులు, యాదాద్రి అభివృద్ధి పనుల్లో జాప్యం జరగడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయడానికి మరో ఐదేళ్లు కావాలా ? అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత తొందరగా పనులను పూర్తి చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం యాదాద్రి ఆలయ నిర్మాణం పనులతో పాటు పట్టణంలోని అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించిన సీఎం కేసీఆర్… పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. 


ఆలయ అభివృద్ధికి రూ.473 కోట్లతో ప్రతిపాదనలు పంపామని యాదాద్రి అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణ పనుల కోసం తక్షణమే రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు.  మరోవైపు.. యాడాకు మరో ఉన్నతాధికారిని నియమించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్‌ అండ్‌ బీ పనులకు సంబంధించి ఎస్‌ఈ స్థాయి వ్యక్తి పర్యవేక్షిస్తున్నారు. అధికారుల కోరిక మేరకు త్వరలోనే సీఈ స్థాయి వ్యక్తిని ఉన్నతాధికారిగా నియమించను న్నట్లు తెలుస్తోంది.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM