ఓటేసిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు

byసూర్య | Mon, Jan 21, 2019, 10:35 AM

హైదరాబాద్: రాష్ట్రంలో తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా సినీ, రాజకీయ, పోలీసు, అధికారులు, పలు రంగాల ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేశారు. సొంత ఊళ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డి జిల్లా డాకూర్‌లో సినీ హీరో జయంత్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని 14వ బూత్‌లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఆయన సతీమణి ఉషా దయాకర్‌రావు ఓటు వేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లోని పోలింగ్ స్టేషన్‌ను జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు పరిశీలించారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండల కేంద్రంలోని పంచాయతీ ఎన్నికల కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరిత తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరుగుతున్నదని సిద్ధిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దేవరకొండ కృష్ణ భాస్కర్ చెప్పారు. నంగునూరు, ఖానాపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.  మెదక్ జిల్లాలో మొదటి విడుత పోలింగ్ ప్రశాంతంగా జ‌రుగుతోంది. 6 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్ మండలం కుచాన్ పల్లిలో పంచాయతీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి సుభాష్‌రెడ్డి త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.


Telangana ,First Phase ,Gram Panchayat Election ,


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM