గ్రామీణ నేపథ్యంలో సాగే కళ్యాణ్ రామ్ 'ఎంతమంచివాడవురా'

by సూర్య | Mon, Aug 19, 2019, 05:12 PM

విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే కల్యాణ్ రామ్, తాజాగా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే 'ఎంతమంచివాడవురా'. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, సతీశ్ వేగేశ్న దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో 'శతమానం భవతి' .. 'శ్రీనివాస కల్యాణం' వంటి చిత్రాలు సతీశ్ వేగేశ్న నుంచి వచ్చిన విషయం తెలిసిందే.


తాజాగా 'ఎంతమంచివాడవురా' సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో కల్యాణ్ రామ్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. టైటిల్ ను బట్టే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమని తెలుస్తోంది. కథాకథనాల పరంగా చూసుకుంటే ఇది తన కెరియర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి. 

Latest News
 
'రామం రాఘవం' టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:01 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 06:56 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM
కేరళలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' Fri, Apr 26, 2024, 06:30 PM