సాహో’లో కొత్త ప్రభాస్‌ని చూస్తారు : అరుణ్‌ విజయ్‌

by సూర్య | Sun, Aug 18, 2019, 10:17 PM

బాహుబలి’ తర్వాత ‘సాహో’లో కొత్త ప్రభాస్‌ని చూస్తారని యాక్టర్ అరుణ్‌ విజయ్‌ అన్నారు. ఆదివారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సాహో’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు త్వరలోనే పండగ రాబోతోంది. ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుందని ప్రభాస్‌ చెప్పారు. ఆయనకు నా ధన్యవాదాలు. ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. అలాంటి వ్యక్తి నటించిన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. సుజీత్‌ చూడటానికి చాలా చిన్నవారిలా కనిపించినా, అతని విజన్‌ చాలా పెద్దది. జాకీష్రాఫ్‌, మందిరాబేడి, నీల్‌నితిన్‌ ముకేశ్‌ తదితర నటులతో మంచి నటన రాబట్టుకున్నారు. హాలీవుడ్‌ స్థాయిలో సినిమా ఉంటుంది. ఇందులోని ప్రతి సన్నివేశం కోసం ప్రభాస్‌ ఎంతో కష్టపడ్డారు.యాక్టింగ్‌, స్టైల్‌, నటన అన్నీ కొత్తగా ఉంటాయి. ఒక కొత్త ప్రభాస్‌ను చూస్తారు’’ అని చెప్పుకొచ్చారు.  

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM