యువ హీరోలకు గట్టిగానే క్లాస్ పీకిన చిరంజీవి

by సూర్య | Sun, Aug 18, 2019, 10:50 PM

అవును యువ హీరోలకు చిరంజీవి గట్టిగానే క్లాస్ పీకాడు. ఒకప్పుడు నేను రోజుకు మూడు నాలుగు సినిమాల షూటింగ్‌లో పాల్గొనేవాడిని. అలా యేడాదికి నేను నటించిన మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి. అప్పట్లో ఒక సినిమాకు ఎక్కువలో ఎక్కువగా 50 నుంచి 60 రోజులు కేటాయించేవాళ్లం. ఇప్పటి హీరోలు మాత్రం ఒక్కో సినిమాకు 150 నుంచి 200 రోజులు కేటాయిస్తున్నారు. దీని వల్ల థియేటర్స్ బిజినెస్‌తో నిర్మాతలకు ఖర్చు తడిసి మోపెడువుతుందని చెప్పుకొచ్చారు. అప్పట్లో మేమంత ఉదయం 7 గంటలకు షూటింగ్‌కు వచ్చేవాళ్లం. పదింటికి బ్రేక్ ఫాస్ట్. తర్వాత మళ్లీ షూటింగ్. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్. ఇలా ప్రతితీ ఒక పద్దతిగా చేసుకుంటూ వెళ్లాం. ఈ రోజుల్లో మాత్రం షూటింగ్ 11 గంటలకు మొదలు పెడుతున్నారు. తాజాగా ‘సైరా’ సినిమాతో నేను మళ్లీ నేను పాత సంప్రదాయం ప్రకారం ఉదయం 7 గంటలకే షూటింగ్‌కు మేకప్‌తో షూటింగ్‌లో పాల్గొన్నానన్నారు.  నా కెరీర్‌ ప్రారంభం నుంచి ఇంతే. ఏడింటి కల్లా సెట్‌లో రెడీగా ఉండేవాడిని. ఇపుడు వయసు పెరిగింది. రిలాక్స్ అవ్వొచ్చు. నా సొంత సినిమా కాబట్టి ఎపుడు వెళ్లినా నడిచేది కానీ అలా చేయలేదన్నారు. ఇప్పటి హీరోలకు ఒక్కో సినిమాకు 150 నుంచి 180 కేటాయించవద్దని చెబుతున్నా. టెక్నాలజీ పెరిగింది కాబట్టి మంచి క్వాలిటీతో ఉన్న సినిమాలు తీయవచ్చు. ఏడు నుంచి తొమ్మిదింటి లోపు షూటింగ్ ప్రారంభిస్తే చాలా కలిసి వస్తుంది. ఓ హీరో పనిలో వేగం పెంచితే దాని టర్నోవర్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. హీరోలు, దర్శకులు గట్టిగా అనుకుంటే నిర్మాతలను ఆదుకోవచ్చని చెబుతూ ఇపుడున్న యువ హీరోలకు గట్టిగానే క్లాస్ పీకారు.  

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM