భన్సాలీ దర్శకత్వంలో ఆలియా

by సూర్య | Sun, Aug 18, 2019, 07:54 PM

ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ఇన్‌షా అల్లా’ సినిమాలో అవకాశం రావడంతో ఎగిరి గంతేశారట బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌. అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా ఆలియాను తీసుకు న్నారు‌. ఈ విషయాన్ని నటికి  ఫోన్‌ చేసి చెప్పడంతో ఆమె ఎగిరి గంతేశారట. భన్సాలీ దర్శకత్వంలో నటించాలన్నది తన కల అని ఓ సందర్భంలో ఆలియా చెప్పారు. ఈ సినిమాతో ఆమె కల నెరవేరబోతోంది. 
ఈ సందర్భంగా ఆలియా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫోన్‌ రాగానే ఎగిరి గంతేశాను. ఆ సమయంలో నేను భారత్‌లో లేను.. విదేశాల్లో ఉన్నాను. విషయం వినగానే దాదాపు 5 నిమిషాల పాటు పైకి, కిందకు దూకి గంతులేశాను. ఎందుకంటే కథ నాకు నచ్చింది. చాలా ఉత్సుకతగా అనిపించింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మొదటిసారిగా సల్మాన్‌ సరసన ఆలియా నటిస్తుండటం విశేషం . ప్రస్తుతం ఆలియా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్‌’తో పాటు ‘బ్రహ్మాస్త్ర’, ‘తఖ్త్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.   

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM