సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుష్క వస్తుందా?

by సూర్య | Sun, Aug 18, 2019, 07:48 PM

ఇప్పటి అనేక మార్లు తాము ఎటువంటి రిలేషన్ లో లేము అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు అనుష్క మరియు ప్రభాస్. వీరు కలిసి నటించిన సినిమాలు బాగా ఆడటం, వీరి కెమిస్ట్రీ కి మంచి పేరు రావడం తో అంతా ఎంతో సంతోషించారు. చాలాకాలం మీడియా లో వీరు పెళ్ళి చేసుకోనున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న నేపథ్యం లో అనేక మంది మీడియా వాళ్ళతో ప్రభాస్ ముచ్చటించడం జరుగుతోంది. ఈ సందర్భం గా అనేక మంది ప్రభాస్ ని అనుష్క తో రిలేషన్ గురించి అడుగుతున్న తీరు హీరో ని ఇబ్బంది పెట్టేలా చేస్తోంది . అయితే ప్రభాస్ నటించిన సాహో సినిమా కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు రామోజీ ఫిలిం సిటీ లో జరగున్న నేపథ్యం లో ముఖ్య అతిధులు గా ఎవరు వస్తారు అనే విషయం పై క్లారిటీ లేకుండా పోయింది. అయితే ప్రభాస్ ఈ వేడుక కి అనుష్క కోసం ప్రత్యేక ఆహ్వానం పంపాడని, అనుష్క వస్తుందా లేదా అనే ఆసక్తి ని మాత్రం మీడియా ఒక రేంజ్ లో క్రియేట్ చేస్తుంది. మరి అనుష్క వస్తుందో రావట్లేదా అనే విషయం తెలుసుకోవాలంటే  ఆగాల్సిందే.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM