అఖిల్ స‌ర‌స‌న పూజా హెగ్డే?

by సూర్య | Sat, Jun 22, 2019, 03:14 PM

ఇండస్ట్రీ లోకి అఖిల్ అక్కినేని  అడుగు పెట్టిన నాటి నుంచి ఇప్పటికి  చేసిన మూడు సినిమాలు   భారీ డిజాస్టర్ లుగానే మిగిలిపోయాయి.  అన్ని  లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలే కానీ అఖిల్ కి మాత్రం కలిసిరాలేదు,  ఇప్పుడు త‌న నాల్గవ సినిమా  కసరత్తులు ఆరంభించేసాడు. . గీత ఆర్ట్స్ బ్యానర్ పై  నిర్మించే ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్  డైరెక్ట్ చేస్తున్నాడు. అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మించే ఈసినిమా అయినా అఖిల్‌ని హీరోగా నిల‌బెడుతుంద‌న్న ఆశ‌లో ఉన్నాడు నాగార్జున‌.  అయితే అఖిల్‌కి జోడీగా   పూజ హెగ్డే ని ఎంపిక‌చేసిన‌ట్టు వార్తలు వస్తున్నాయి. ప్పటికి టాలీవుడ్ కోలీవుడ్ లో కలిపి పూజ చేతిలో మూడు సినిమాలు బుక్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్ సరసన పూజ నటించడానికి భారీ ఎత్తున రెమ్యూనేష‌న్ ఇచ్చేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ట‌. 


రోజుకు 3 షిఫ్టుల్లో కూడా పని చేసేంత సత్తా తనకు ఉందని ఈ ముద్దుగుమ్మ  గతంలోనే ప్రకటించిన‌విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని   గట్టి  ప్రయత్నం చేస్తున్నార‌ట‌. ఇదే వాస్త‌వ రూపం దాలిస్తే పూజ అఖిల్ సినిమాలో అందాలు ఆర‌బోయ‌టం ఖాయం.  చూద్దాం మరి ఏం చేస్తారో.


 


 

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM