ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతున్న నటాషా

by సూర్య | Thu, Oct 31, 2024, 05:38 PM

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా వివాహిక జీవితం గురించి అందరికి తెలిసిందే. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.ఓ పార్టీలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఈ జంట పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకువెళ్లారు.అయితే పెళ్లికి ముందు రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారనే ప్రచారం జరిగింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా,నటాషా స్టాంకోవిచ్‌లు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది.కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తాయి.దీంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయారు.దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే నటాషా ఇటీవలే తిరిగి ఇండియాకు రావడం జరిగింది. కొడుకు అగస్త్యను తీసుకుని ఇండియాకు వచ్చారు నటాషా. ఇండియాకు వచ్చిన నటాషా ముంబై విధుల్లో తిరుగుతూ కనిపించారు. ఆమెతో పాటు బాయ్‌ఫ్రెండ్‌ అలెక్సాండర్‌ ఇలాక్‌ కూడా ఉండటం గమనార్హం.


వీరిద్దరూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైట్‌ జాకెట్‌ వేసుకున్న నటాషా ఓ జిమ్‌ వద్ద ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. అనంతరం ఆమె స్వయంగా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోయింది. గతంలో కూడా నటాషా అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో కలిసి దర్శనం ఇచ్చింది. హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన తర్వాతే ఆమె అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో రిలేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తోందని తెలుస్తోంది. అలెగ్జాండర్ అలెక్సిలిక్‌ గతంలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీతో రిలేషన్‌లో ఉన్నాడు. ఆమెతో బ్రేకప్ చెప్పిన అనంతరం నటాషా డేటింగ్ చేస్తున్నాడు.

Latest News
 
'కుబెరా' చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది - శేఖర్ కమ్ముల Mon, Mar 24, 2025, 09:28 PM
హైదరాబాద్కు 140 దేశాల అందాల భామలు Mon, Mar 24, 2025, 08:22 PM
విజయ్‌ ‘జన నాయగన్‌’.. విడుదల తేదీ ఖరారు Mon, Mar 24, 2025, 08:13 PM
ఈ కార‌ణంతో నేను ఎన్నో అవ‌కాశాలు కోల్పోయా Mon, Mar 24, 2025, 07:26 PM
'OG' నుండి ఇమ్రాన్ హష్మీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ Mon, Mar 24, 2025, 07:12 PM