'దేవర పార్ట్ 1' నుండి దావుడి వీడియో సాంగ్ అవుట్

by సూర్య | Mon, Oct 28, 2024, 05:31 PM

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "దేవర పార్ట్ 1" బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రతి ప్రాంతంలో కొత్త రికార్డులను నెలకొల్పింది. మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ ఈ చిత్రం ఆకట్టుకునే వసూళ్లను సాధించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 509 కోట్లు వాసులు చేసింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని దావుడి వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ, ప్రేక్ష రాజ్, అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM