ఓపెన్ అయ్యిన 'లక్కీ బాస్కర్' ప్రీమియర్ బుకింగ్స్

by సూర్య | Mon, Oct 28, 2024, 05:05 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన రాబోయే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 31న దీవాలి సందర్భంగా విడుదల కానుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించడంతో లక్కీ బాస్కర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా ప్రీమియర్ బుకింగ్స్ అక్టోబర్ 30న విడుదల జరుగనున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ బహుభాషా చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సాయి కుమార్, మానస చౌదరి, రాంకి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్ మరియు ఇతర ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM