75 రోజుల కౌంట్‌డౌన్ లో రానున్న 'గేమ్ ఛేంజర్'

by సూర్య | Mon, Oct 28, 2024, 04:45 PM

శంకర్ షణ్ముగం దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యాక్షన్ డ్రామా చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీలో జనవరి 10, 2025న విడుదల కానుంది. ఈ సినిమా యొక్క టీజర్ ని దివాళి సందర్భంగా విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు  పుకార్లు వచ్చాయి. అయితే ప్రొడక్షన్ హౌస్ నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేకుండా అభిమానులు సస్పెన్స్‌లో ఉన్నారు. వీటన్నింటి మధ్య మేకర్స్ '75 డేస్ టు గో' అనే సందేశంతో పోస్టర్‌తో విడుదల తేదీకి కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. త్వరలోనే టీజర్ కూడా రానుందని వెల్లడించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర మరియు మరికొంతమంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM