'లక్కీ బాస్కర్' పెయిడ్ ప్రీమియర్ ఎప్పుడంటే...!

by సూర్య | Sat, Oct 26, 2024, 06:02 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన రాబోయే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 31న దీవాలి సందర్భంగా విడుదల కానుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించడంతో లక్కీ బాస్కర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ ని అక్టోబర్ 30న రెండు తెలుగు రాష్ట్రాలలో 100+ ప్రీమియర్ షోస్ ని ప్లాన్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ బహుభాషా చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Latest News
 
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'జ్విగాటో' Sat, Oct 26, 2024, 07:12 PM
'థగ్ లైఫ్' ఈ తేదీన విడుదల కానుందా? Sat, Oct 26, 2024, 07:06 PM
150M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పుష్ప 2' టీజర్ Sat, Oct 26, 2024, 07:00 PM
'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ అవుట్ Sat, Oct 26, 2024, 06:58 PM