OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'సత్యం సుందరం'

by సూర్య | Fri, Oct 25, 2024, 04:08 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ నటించిన 'మెయ్యళగన్' సెప్టెంబర్ 27న విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో సెప్టెంబర్ 28న విడుదల అయ్యింది. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా, ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. ఈ హిట్ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో  తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీలో ప్రసారానికి అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM