14వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?

by సూర్య | Fri, Oct 25, 2024, 11:34 AM

మాచో స్టార్ గోపీచంద్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా రిలీజైన టైమ్‌లో బాక్సాఫీస్ వద్ద ఉన్న పోటీ దృష్ట్యా విశ్వం ఓ వీకెండ్‌కే చాప చుట్టేస్తుందని అంతా భావించారు.కానీ పండగ సెలవులు ముగిసినప్పటికీ గోపీచంద్ సినిమాకు జనం నుంచి అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వం మూవీ 13వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..విశ్వం మూవీ విజయం దర్శకుడు శ్రీనువైట్లకు మంచి ఉపశమనం కలిగించింది. హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు శ్రీను. కామెడీని పక్కనపెట్టి మాస్, యాక్షన్ , థ్రిల్లర్ సబ్జెక్ట్స్‌తో ప్రయోగాలు చేసినా జనం ఆదరించలేదు. ఈ నేపథ్యంలో గోపీచంద్‌తో ఆయన జతకట్టడంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. ఇద్దరూ ఫ్లాప్స్‌లో ఉండటంతో ఈ కాంబినేషన్ ఎలా వర్కవుట్ అవుతుందోనని విశ్లేషకులు సైతం షాక్ అయ్యారు. ప్రయోగాల జోలికి పోకుండా తనకు అచ్చొచ్చిన కామెడీనే నమ్ముకుని విశ్వం తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు శ్రీనువైట్ల. తను గెలవడంతో పాటు గోపీచంద్‌కు కూడా పెద్ద ఊరట కలిగించారు.


విశ్వం సినిమాను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్‌ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.


టీజర్, ట్రైలర్లతో పాటు గోపీచంద్ - శ్రీనువైట్ల కాంబినేషన్ కావడంతో విశ్వం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌ను గోపీచంద్ ముందు పెట్టారు.


 


దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం . పండగ సెలవులు కావడంతో తొలి మూడు రోజుల్లో కలెక్షన్ల వర్షం కురిపించాడు గోపీచంద్. తర్వాత ఈ సినిమా దుకాణం సర్దేసినట్లేనని అంతా అనుకున్నారు. అప్పటికి మార్కెట్‌లో ఎన్టీఆర్ దేవర, రజనీకాంత్ వేట్టయన్ సహా చిన్నా పెద్దా సినిమాలు ఉన్నాయి. ఈ పోటీని తట్టుకుని మరి తన వసూళ్ల జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు గోపీచంద్.


ఈ నేపథ్యంలో 14వ రోజు విశ్వం కలెక్షన్స్‌ని ఒకసారి పరిశీలిస్తే.. గురువారం కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగా జరిగాయి. బుధవారంతో పోల్చితే వసూళ్లు కూడా బాగా పెరిగాయి. 14వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.80 లక్షల వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 14 రోజుల వరకు నికరంగా రూ. 13.91 కోట్ల వసూళ్లను సాధించి హిట్ దిశగా పరుగులు తీస్తున్నాడు గోపీచంద్. శుక్రవారం నుంచి వీకెండ్ మొదలుకానుండటంతో విశ్వం ఈ స్థాయిలో దుమ్మురేపుతుందో చూడాలి.

Latest News
 
మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం Fri, Oct 25, 2024, 01:04 PM
14వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే? Fri, Oct 25, 2024, 11:34 AM
అనారోగ్యంతో రాన్ ఎలీ కన్నుమూత Fri, Oct 25, 2024, 10:51 AM
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM