నటుడు రామస్వామిపై దాడి చేసిన ప్రేక్షకురాలు

by సూర్య | Thu, Oct 24, 2024, 07:18 PM

అంజన్‌ రామచంద్ర, శ్రావణి జంటగా నటించిన చిత్రం 'లవ్‌రెడ్డి'. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ఈ చిత్రబృందం హైదరాబాద్‌ నగరంలోని థియేటర్ల విజిట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా నిజాంపేట జీపీఆర్ మల్టీప్లెక్స్‌ థియేటర్‌కు వెళ్లిన లవ్‌రెడ్డి చిత్రబృందానికి ఓ చేదు అనుభవం ఎదురైంది. 'లవ్ రెడ్డి' చిత్రబృందంలోని నటుడిపై ఓ ప్రేక్షకురాలు దాడికి పాల్పడింది. ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఆ ప్రేక్షకురాలు ఈ చిత్రంలో తండ్రి పాత్రను పోషించిన ఎన్ టీ రామస్వామి అనే నటుడు నిజంగానే ఆ ప్రేమజంటను విడదీశాడని అనుకుని కోపంతో తిడుతూ దాడి చేసింది. ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి, ఇతర టీమ్ మెంబర్స్ ఆ మహిళను అడ్డుకుని ఆమెకు నచ్చజెప్పారు. ఇది కేవలం సినిమా మాత్రమేనని ఆమెకు తెలియజేశారు. ఎన్ టీ రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, అతను సినిమాలో చూపించినట్లు చెడ్డవాడు కాదంటూ మహిళకు చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. 

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM