'ధూమ్ ధామ్' నుండి కుందనలబొమ్మ సాంగ్ మేకింగ్ వీడియో అవుట్

by సూర్య | Thu, Oct 24, 2024, 07:07 PM

తెలుగు నటుడు చేతన్ కృష్ణ సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో తన రాబోయే చిత్రం ధూమ్ ధామ్ తో అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో నటుడి సరసన హెబ్బా పటేల్ నటిస్తోంది. ఈ రాబోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ థ్రిల్లింగ్ రైడ్‌ గా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ రొమాన్స్, ఫన్ మరియు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో నిండిన రంగుల మరియు వినోదాత్మక కథనాన్ని ప్రదర్శిస్తూ అపారమైన ఉత్సాహాన్ని సృష్టించింది. గోపీ సుందర్ పాటలు ఇప్పటికే విస్తృత ప్రజాదరణ పొందాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని కుందనలబొమ్మ సాంగ్ మేకింగ్ వీడియోని విడుదల చేసినట్లు ప్రకటించారు. గోపి సుందర్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శ్రీ కృష్ణ తన గాత్రాని అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై MS రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ కానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 8న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. 

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM