ఆహ్వానం అక్కర్లేదు, వెళ్లి తీరుతా

by సూర్య | Tue, Oct 22, 2024, 11:24 PM

అగ్రహీరో విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) మహానాడుకు ఆహ్వానం లేకపోయినప్పటికీ ఓటరుగా వెళతానని కోలీవుడ్‌ హీరో విశాల్‌ అన్నారు. స్థానిక తేనాంపేటలో యాసిడ్‌ దాడి బాధితుల కోసం సోమవారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న విశాల్‌ యాసిడ్‌ దాడి బాధితులకు తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ నేతల కంటే గొప్పగా విజయ్‌ ఏం చేయబోతున్నారో.. అనే విషయాన్ని తెలుసుకునేందుకు టీవీకే మహానాడుకు ఓటరుగా హాజరవుతా. నాకు ఆహ్వానం అక్కర్లేదు. ఎందుకంటే నేను కూడా రాజకీయ నేతనే. ఓటరుగా, ప్రేక్షకుడిగా వెళ్లేందుకు ఆహ్వానం అక్కర్లేదు. టీవీకేలో చేరాలా? వద్దా? అనేది రెండో అంశం.


ఆ పార్టీలో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుడే. ఆ ప్రకారంగా చూసినా నేను కూడా ఓ రాజకీయ నేతనే.. అని విశాల్‌ పేర్కొన్నారు.మొదటి నుండి విజయ్ స్థాపించిన నూతన పార్టీ తమిళగ వెట్రి కళగంపై విశాల్ సమయం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఆయన మాటలు విన్నవారంతా.. విశాల్ కూడా విజయ్ పార్టీలో చేరతారని అనుకుంటుంటే.. అలాంటిదేమీ లేదనేలా ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ ఆ పార్టీ వ్యవహారాలపై మాత్రం విశాల్ ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆహ్వానం లేకపోయినా.. టీవీకే మహానాడుకు వెళతానని విశాల్ చెప్పడం చూస్తుంటే.. ఈ వేదికపై విశాల్ టీవీకే‌లో చేరినా చేరతాడనేలా కోలీవుడ్‌లో టాక్ నడుస్తుంది. చూద్దాం.

Latest News
 
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM