ఈ నెల 23న ‘ది రాజాసాబ్‌' టీజర్‌

by సూర్య | Tue, Oct 22, 2024, 11:22 PM

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్‌. మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్థి కుమార్‌ హీరోయిన్లు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆప్‌డేట్‌ రానే వచ్చింది. తాజాగా చిత్ర బృందం ఓ అప్‌డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. డార్లింగ్‌ ప్రబాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23న రాయల్‌ ట్రీట్‌గా టీజర్‌, ట్రెలర్‌ రిలీజ్‌ చేయనున్నట్లుప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్ట్‌ర్‌ను షేర్‌ చేశారు. అందులో ప్రభాస్‌ గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది.


హారర్‌, కామెడీ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రభాస్‌ పుట్టినరోజు నుంచి వరుస అప్‌డేట్స్‌ ఉంటాయని నిర్మాత ఎస్‌కేఎన్‌ తెలిపారు. అక్టోబరు 23 నుంచి సినిమా విడుదల వరకు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.

Latest News
 
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM