2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లక్కీ బాస్కర్' ట్రైలర్

by సూర్య | Tue, Oct 22, 2024, 03:54 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన రాబోయే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించడంతో లక్కీ బాస్కర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ బహుభాషా చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా అక్టోబర్ 31న దీవాలి సందర్భంగా విడుదల కానుంది.

Latest News
 
'మట్కా' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Tue, Oct 22, 2024, 05:27 PM
MS ధోని కంటే విరాట్ కోహ్లీని ఇష్టపడతారు - చంద్రబాబు నాయుడు Tue, Oct 22, 2024, 05:22 PM
అనురాగ్ బసుతో జతకట్టనున్న అమీర్ ఖాన్ Tue, Oct 22, 2024, 05:16 PM
ఉచితంగా భోజనం ఇస్తున్న సందీప్ కిషన్ Tue, Oct 22, 2024, 05:07 PM
'సికందర్‌' షూటింగ్ ని ప్రారంభించిన సల్మాన్ ఖాన్ Tue, Oct 22, 2024, 04:55 PM