'మట్కా' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Tue, Oct 22, 2024, 05:27 PM

కరుణ కుమార్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మట్కా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహి కథానాయికలగా నటిస్తున్నారు. 1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథ కారణంగా వరుణ్ తేజ్ మట్కాలో ఇప్పటి వరకు అత్యంత సవాలుగా ఉండే పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం వరుణ్ తేజ్ పాత్ర యొక్క యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది. ఈ పీరియాడికల్ డ్రామా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ ని తస్సాదియ్యా అనే టైటిల్ తో అక్టోబర్ 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. GV ప్రకాష్ కుమార్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా మనో తన గాత్రాన్ని అందించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం యొక్క యాక్షన్-ప్యాక్డ్ టీజర్ మరియు మేకింగ్ వీడియోలు విపరీతమైన సంచలనాన్ని సృష్టించాయి. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవిశంకర్ మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ క్రూలో జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజర్, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ గా ఉన్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై డా.విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది.

Latest News
 
సమంత షాకింగ్ కామెంట్స్!... నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది Tue, Oct 22, 2024, 07:44 PM
సన్నీ డియోల్ 'జాట్' లో సన్నీ లియోన్? Tue, Oct 22, 2024, 07:42 PM
'మా నాన్న సూపర్‌హీరో' నుండి వేడుకలో వీడియో సాంగ్ రిలీజ్ Tue, Oct 22, 2024, 07:36 PM
గంగవ్వకు గుండెపోటు ? Tue, Oct 22, 2024, 07:34 PM
'లగ్గం' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Tue, Oct 22, 2024, 07:28 PM