హనుమాన్ : 100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న పూలమ్మే పిల్ల వీడియో సాంగ్

by సూర్య | Mon, Oct 21, 2024, 07:03 PM

ప్రశాంత్ వర్మ యొక్క సూపర్ హీరో యాక్షన్ చిత్రం "హనుమాన్" 2024లో అతిపెద్ద హిట్‌లలో ఒకటి గా నిలిచింది. ఈ సినిమా ఈ అక్టోబర్‌లో జపాన్‌లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనుంది. అదే సమయంలో ఎంపిక చేసిన భారతీయ థియేటర్లలో ఈ చిత్రం ప్రత్యేక 3D రీ-రిలీజ్‌ను కూడా అందుకుంటుంది. తేజ సజ్జ ప్రధా పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ 300 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా లోని పొల్లమ్మే పిల్ల వీడియో సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సామాచారం. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. హనుమాన్ 2024 సంక్రాంతికి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది మరియు ఇది భారీ చిత్రాలతో పాటు విడుదలైనప్పటికీ సంచలన విజయం. ఈ సినిమాలో తేజ సజ్జ ప్రేమికురాలిగా అమృత అయ్యర్ నటించగా, అతని సోదరిగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించింది. వినయ్ రాయ్ విలన్ గా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ విఎఫ్‌ఎక్స్ భారీ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
ఇషా చావ్లా లేటెస్ట్ స్టిల్స్ Tue, Oct 22, 2024, 02:06 PM
ప్రభాస్ తో మల్టీస్టారర్ మూవీలో నటిస్తా: దుల్కర్ సల్మాన్ Tue, Oct 22, 2024, 01:02 PM
స్వీయ వివాహం చేసుకున్న స్టార్ పాప్ సింగర్ Tue, Oct 22, 2024, 11:53 AM
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM