వరల్డ్ వైడ్ గా 300 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'వెట్టయన్'

by సూర్య | Sat, Oct 19, 2024, 03:11 PM

జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'వేట్టయాన్' చిత్రం అక్టోబర్ 10, 2024న తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఈ సూపర్ కాప్ థ్రిల్లర్ లో లెజెండరీ నటుడు పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా కాన్సెప్ట్ మరియు మొదటి సగం ప్రశంసలను అందుకుంది, అయితే విమర్శకులు సెకండ్ హాఫ్‌లో సమస్యలను కనుగొన్నారు. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో బిగ్గీ చాలా మంచి ఓపెనింగ్స్ సాధించింది. తొలి అంచనాల ప్రకారం వెట్టయన్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ వాసులు చేసింది. ఈ విషయూన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. 2024లో తలపతి విజయ్ ది గోట్ తర్వాత కోలీవుడ్‌లో వెట్టయన్ రెండవ అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. మిక్స్‌డ్‌ రివ్యూస్‌ దృష్ట్యా, వారాంతంలో ఈ సినిమా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. సాంకేతిక సిబ్బందిలో సినిమాటోగ్రాఫర్ SR కతిర్ I.S.C మరియు ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జిఎం సుందర్, రోహిణి, రావు రమేష్, కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM