‘భీష్మ’ మూవీ ప్రారంభం

by సూర్య | Wed, Jun 12, 2019, 12:28 PM

కంటెంట్ ఎలాగున్నా సినిమా టైటిల్ మాత్రం క్యాచీగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు నితిన్. అందుకే ఆయన సినిమాల పేర్లు రోటిన్‌కి భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి వెరైటీ టైటిల్‌తోనే సినిమా చేస్తున్నాడు నితిన్. ‘భీష్మ’ అని టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమాకి ‘సింగిల్ ఫర్ ఎవర్’ అనేది ట్యాగ్ లైన్. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండే భీష్ముడి తరహా పాత్రను నితిన్ పోషించబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ‘మన్మథుడు’ టైపులో వెరైటీగా ఉండి, జనాలను ఆకట్టుకుంటుందని అంటున్నారు.నాగశౌర్యతో ‘ఛలో’ వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన వెంకీ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే నితిన్ బర్త్ డే సందర్భంగా ‘భీష్మ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సింగిల్ ఫర్ ఎవర్ అనేది ఉపశీర్షిక.


మహాభారతంలో భీష్ముడిలా బ్రహ్మచారిలా ఉండాలనుకునే ఒక కుర్రాడి కథ ఇది. కానీ ఈ పోస్టర్ చూస్తుంటే అతని మది నిండా అమ్మాయిలు ఉన్నట్టు చూపించారు.  చూస్తుంటే ఆధునిక భీష్ముడి టైపు క్యారెక్టర్ అన్నమాట. అనుభవించు రాజా టైపు పాత్ర అన్నట్టు భీష్మ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. అమ్మాయిలతో తిరుగుతాడు.కానీ పెళ్లి మాత్రం నో అని చెప్పే మాడ్రన్ భీష్మ క్యారెకర్ట్ అని ఈ పోస్టర్‌ను చూస్తే అర్థమవుతుంది.ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నితిన్‌తో పాటు రష్మిక మందన్న‌తో పాటు దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. ఈ చిత్రానికి మణిశర్మ కొడుకు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఈ నెల 20 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.





Latest News
 
'SK23' లో మాలీవుడ్ నటుడి కీలక పాత్ర Fri, Apr 26, 2024, 05:57 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 05:51 PM
'ఆ ఒక్కటి అడక్కు' లోని మెలోడియస్ సాంగ్ హమ్మమ్మో అవుట్ Fri, Apr 26, 2024, 05:46 PM
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ ఖరారు Fri, Apr 26, 2024, 05:38 PM
'ది 100' టీజర్ అవుట్ Fri, Apr 26, 2024, 05:29 PM