విజయ్ సేతుపతి జోడీగా భవానీశ్రీ

by సూర్య | Wed, Jun 12, 2019, 03:14 PM

వెండితెరపై హీరోలుగా వెలుగొందుతోన్నవారిలో అన్నదమ్ములు వున్నారు. హీరోయిన్లుగా హవాను కొనసాగిస్తోన్న వారిలో అక్కా చెల్లెళ్లు వున్నారు. అందుకు భిన్నంగా హీరోల జాబితాలో అన్నా .. హీరోయిన్ల జాబితాలో చెల్లెలు కనిపించనున్నారు. 


తమిళంలోని యువ కథానాయకులలో జీవీ ప్రకాశ్ కుమార్ స్థానం ప్రత్యేకం. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమాలు చేస్తూ ఆయన మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆయన చెల్లెలు భవానిశ్రీ హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కానుంది. దర్శకుడు విరుమాండి తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. మరో కథానాయికగా భవానీశ్రీని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం సెట్స్ పై వున్న ఈ సినిమాను, తెలుగులోను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. 


 


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM