'కూలీ నెం 1' జోడి మరోసారి జత కట్టారు...

by సూర్య | Mon, Jun 10, 2019, 02:19 PM

మొదటి నుంచి కూడా వెంకటేశ్ రీమేక్ ల పట్ల ఆసక్తిని కనబరుస్తూనే వచ్చారు. అలా ఆయన సక్సెస్ లలో రీమేక్ చిత్రాలు చాలానే కనిపిస్తాయి. తాజాగా ఆయన మరో రీమేక్ చిత్రం చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల హిందీలో విడుదలైన 'దే దే ప్యార్ దే' చిత్రం అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. అజయ్ దేవగణ్ .. రకుల్ .. టబూ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా నిర్మితమైంది.

పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించనున్నారు. హిందీలో టబు చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే తీసుకున్నారనేది తాజా సమాచారం. 28 ఏళ్ల క్రితం 'కూలీ నెం 1' సినిమాలో వెంకీతో జోడీ కట్టిన టాబు, మళ్లీ ఇంతకాలానికి ఆయన సరసన కనిపించనుందన్న మాట. ఇక హిందీలో రకుల్ చేసిన పాత్రకి తెలుగులోను ఆమెనే తీసుకుంటారో .. మరొకరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.

Latest News
 
ఈ హిందీ చిత్రంపై ప్రశంసలు కురిపించిన దేవర నటి Mon, May 13, 2024, 02:16 PM
రెంటల్ బేస్ పై అందుబాటులోకి వచ్చిన గాడ్జిల్లా x కాంగ్-ది న్యూ ఎంపైర్ Mon, May 13, 2024, 02:07 PM
ఐడెంటిటీ షూటింగ్ ని పూర్తి చేసుకున్న త్రిష Mon, May 13, 2024, 02:06 PM
తన చిత్రం యొక్క డిజాస్టర్‌పై స్పందించిన అగ్ర నిర్మాత Mon, May 13, 2024, 01:52 PM
బాహుబలి నిర్మాతల 'యక్షిణి' గురించిన కీలక వివరాలు Mon, May 13, 2024, 01:44 PM