స్ట్రీమింగ్ పార్టనర్ ని ఖరారు చేసిన 'ARM'

by సూర్య | Tue, Oct 01, 2024, 02:58 PM

జితిన్ లాల్ దర్శకత్వంలో మలయాళ నటుడు టోవినో థామస్ నటించిన అజయంతే రాండమ్ మోషణం (ARM) చిత్రం సెప్టెంబర్ 12, 2024న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి మరియు కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. టోవినో థామస్ యొక్క 50వ చిత్రంగా ఉన్న ఈ సినిమా ఒక ఎపిక్ ఫాంటసీ సాగా. ఈ పాన్-ఇండియా చిత్రం పూర్తిగా 3Dలో రూపొందించబడింది మరియు మలయాళ సినిమా చరిత్రలో అత్యంత సాంకేతికంగా గొప్ప చిత్రాలలో ఒకటిగా ఉంది. మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలతో పాటు స్పానిష్‌లో కూడా విడుదల అయ్యింది. అదనంగా మలయాళం వెర్షన్ 30 భారతీయ మరియు విదేశీ భాషలలో ఉపశీర్షికలతో విడుదల అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ LIV సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, జగదీష్, హరీష్ ఉత్తమన్, హరీష్ పెరడి, ప్రమోద్ శెట్టి మరియు రోహిణి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేసింది. ఈ చిత్రానికి దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్ మరియు లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ నంబియార్ కథను అందించారు.

Latest News
 
సల్మాన్ 'సికందర్' పై వాతావరణ ప్రభావం Tue, Oct 01, 2024, 05:09 PM
'సత్యం సుందరం : AMB సినిమాస్ కి రానున్న కార్తీ Tue, Oct 01, 2024, 05:06 PM
'కమిటీ కుర్రోళ్లు' జాతీయ అవార్డుకు అర్హత ఉంది - నాగబాబు Tue, Oct 01, 2024, 04:46 PM
'దేవర' డబ్బింగ్‌ కి విజయం సాధించిన జూనియర్ ఎన్టీఆర్ Tue, Oct 01, 2024, 04:37 PM
రేపే 'కాళీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ Tue, Oct 01, 2024, 04:34 PM