అక్టోబర్ 3న ఓటీటీలోకి విజయ్‌ ‘ది గోట్‌’

by సూర్య | Tue, Oct 01, 2024, 12:19 PM

దళపతి విజయ్ నటించిన ‘ది గోట్’ చిత్రం ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ చిత్రం అక్టోబర్‌ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించినప్పటికీ మిశ్రమ స్పందన వచ్చింది. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ మూవీలో త్రిష, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, స్నేహ, వైభవ్, లైలా, ప్రభుదేవా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో దివంగత నటుడు విజయ్ కాంత్ రూపాన్ని కూడా చూపించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించింది.

Latest News
 
'వెట్టయన్' సెన్సార్ పూర్తి Tue, Oct 01, 2024, 03:03 PM
స్ట్రీమింగ్ పార్టనర్ ని ఖరారు చేసిన 'ARM' Tue, Oct 01, 2024, 02:58 PM
'కుబేర' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Tue, Oct 01, 2024, 02:53 PM
వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'ఆ ఒక్కటి అడక్కు' Tue, Oct 01, 2024, 02:48 PM
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Tue, Oct 01, 2024, 02:42 PM