'గేమ్ ఛేంజర్' విడుదల పై లేటెస్ట్ బజ్

by సూర్య | Mon, Sep 30, 2024, 07:37 PM

శంకర్ షణ్ముగం దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 20, 2024న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఇటీవలి నివేదికలు ఈ సినిమాని డిసెంబర్ 25, 2024కి వాయిదా వేయవచ్చని సూచిస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర మరియు మరికొంతమంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Latest News
 
'మట్కా' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి టైమ్ ఖారారు Mon, Sep 30, 2024, 07:42 PM
'స్వాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 30, 2024, 07:40 PM
బాడీకాన్ డ్రెస్ లో సమంత Mon, Sep 30, 2024, 07:35 PM
$5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన దేవర Mon, Sep 30, 2024, 07:31 PM
స్టైలిష్ అవుట్‌లుక్‌ లో రకుల్ ప్రీత్ సింగ్ Mon, Sep 30, 2024, 07:29 PM