శ్రద్ధా శ్రీనాథ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మెకానిక్ రాకీ' టీమ్

by సూర్య | Mon, Sep 30, 2024, 07:18 PM

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెకానిక్ రాకీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా కీలక పాత్రలో నటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ మరియు రోడీస్ రఘు రామ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం అక్టోబరు 31, 2024న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది.  

Latest News
 
'మట్కా' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి టైమ్ ఖారారు Mon, Sep 30, 2024, 07:42 PM
'స్వాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 30, 2024, 07:40 PM
బాడీకాన్ డ్రెస్ లో సమంత Mon, Sep 30, 2024, 07:35 PM
$5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన దేవర Mon, Sep 30, 2024, 07:31 PM
స్టైలిష్ అవుట్‌లుక్‌ లో రకుల్ ప్రీత్ సింగ్ Mon, Sep 30, 2024, 07:29 PM