'విశ్వంభర' టీజర్ విడుదలపై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Mon, Sep 30, 2024, 07:08 PM

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రంలో భారీ VFX ఉంటుంది కాబట్టి, VFX పని కోసం భారీ బడ్జెట్ కేటాయించబడింది. విశ్వంబర గ్రాఫిక్స్‌పై పలు టాప్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా టీజర్ దసరా కి విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్‌ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంబర జనవరి 10, 2025న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. UV క్రియేషన్స్ భారీ స్థాయిలోఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
'మట్కా' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి టైమ్ ఖారారు Mon, Sep 30, 2024, 07:42 PM
'స్వాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 30, 2024, 07:40 PM
బాడీకాన్ డ్రెస్ లో సమంత Mon, Sep 30, 2024, 07:35 PM
$5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన దేవర Mon, Sep 30, 2024, 07:31 PM
స్టైలిష్ అవుట్‌లుక్‌ లో రకుల్ ప్రీత్ సింగ్ Mon, Sep 30, 2024, 07:29 PM