'భలే ఉన్నాడే' నుండి నెవర్ ఎండ్ స్టోరీ వీడియో సాంగ్ రిలీజ్

by సూర్య | Mon, Sep 30, 2024, 06:46 PM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన 'భలే ఉన్నాడే'  సినిమా సెప్టెంబర్ 13న విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రేషకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫ్లాప్‌ టాక్‌తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. నూతన దర్శకుడు జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈటీవీ విన్ లో అక్టోబర్ 3న ప్రసారానికి అందుబాటులోకి రానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని నెవర్ ఎండ్ స్టోరీ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా ఎన్.వి.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తుంది.

Latest News
 
'మట్కా' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి టైమ్ ఖారారు Mon, Sep 30, 2024, 07:42 PM
'స్వాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 30, 2024, 07:40 PM
బాడీకాన్ డ్రెస్ లో సమంత Mon, Sep 30, 2024, 07:35 PM
$5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన దేవర Mon, Sep 30, 2024, 07:31 PM
స్టైలిష్ అవుట్‌లుక్‌ లో రకుల్ ప్రీత్ సింగ్ Mon, Sep 30, 2024, 07:29 PM