డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మెకానిక్ రాకీ' టీమ్

by సూర్య | Mon, Sep 30, 2024, 05:11 PM

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెకానిక్ రాకీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం అక్టోబరు 31, 2024న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా కీలక పాత్రలో నటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ మరియు రోడీస్ రఘు రామ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

Latest News
 
బుక్ మై షోలో 'సత్యం సుందరం' కి భారీ రెస్పాన్స్ Mon, Sep 30, 2024, 07:00 PM
రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Mon, Sep 30, 2024, 06:57 PM
మలేషియాలో 'అమరన్‌' బృందం Mon, Sep 30, 2024, 06:57 PM
'స్వాగ్' అనంతపూర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Sep 30, 2024, 06:53 PM
కన్నప్ప నుంచి బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్ విడుదల Mon, Sep 30, 2024, 06:53 PM