శ్రద్ధా శ్రీనాథ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'NBK109' టీమ్

by సూర్య | Mon, Sep 30, 2024, 04:51 PM

బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా NBK109 అనే పేరు పెట్టారు. ఈ సినిమా షూటింగ్‌ను మేకర్స్ తిరిగి ప్రారంభించారు. ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్‌టైనర్ జనవరి 12, 2025న వేసవిని అధిగమించి సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమాకి వీర మాస్‌ అనే టైటిల్ ని లాక్ చేయటానికి పాలన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా శ్రద్ధా శ్రీనాథ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. నందమూరి బాలకృష్ణ సరసన ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, చాందినీ చౌదరి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సందీప్ రాజ్, రవి కిషన్, జగపతి బాబు మరియు షైన్ టామ్ చాకో కీలక పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు.

Latest News
 
'మట్కా' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి టైమ్ ఖారారు Mon, Sep 30, 2024, 07:42 PM
'స్వాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 30, 2024, 07:40 PM
బాడీకాన్ డ్రెస్ లో సమంత Mon, Sep 30, 2024, 07:35 PM
$5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన దేవర Mon, Sep 30, 2024, 07:31 PM
స్టైలిష్ అవుట్‌లుక్‌ లో రకుల్ ప్రీత్ సింగ్ Mon, Sep 30, 2024, 07:29 PM