నేడు విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' సెకండ్ సింగల్

by సూర్య | Mon, Sep 30, 2024, 04:40 PM

శంకర్ షణ్ముగం దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీలో డిసెంబర్ 20, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ రెండవ సింగిల్‌ ని రా మచా మచా (హిందీ వెర్షన్ దమ్ తు దిఖాజా) అనే టైటిల్ తో ఈరోజు హైదరాబాద్  కొమ్మేపల్లిలోని మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజీ లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ ని థమన్ స్వరపరిచారు. రామ్ చరణ్‌ను అల్ట్రా స్టైలిష్ లుక్‌లో చూపించే సరికొత్త పోస్టర్‌ను టీమ్ తర్వాత వెల్లడించింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర మరియు మరికొంతమంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Latest News
 
బుక్ మై షోలో 'సత్యం సుందరం' కి భారీ రెస్పాన్స్ Mon, Sep 30, 2024, 07:00 PM
రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Mon, Sep 30, 2024, 06:57 PM
మలేషియాలో 'అమరన్‌' బృందం Mon, Sep 30, 2024, 06:57 PM
'స్వాగ్' అనంతపూర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Sep 30, 2024, 06:53 PM
కన్నప్ప నుంచి బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్ విడుదల Mon, Sep 30, 2024, 06:53 PM