వాయిదా పడిన 'రోటీ కప్డా రొమాన్స్'

by సూర్య | Mon, Sep 30, 2024, 04:18 PM

హర్ష నర్రా, సందీప్ సరోజ్ మరియు ఇతరులు ప్రధాన పాత్రల్లో యూత్‌ఫుల్ కామెడీ సినిమాని చేస్తున్నారు. ఈ చిత్రానికి 'రోటీ కప్డా రొమాన్స్' అనే టైటిల్ ని లాక్ చేసారు. 'హుషారు', 'సినిమా చూపిస్త మామ', 'మేం వయసుకు వచ్చాం', 'ప్రేమ ఇష్క్ కాదల్' మరియు 'పాగల్' ఫేమ్ లక్కీ మీడియా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా కొన్ని తెలియని కారణాల వాళ్ళ వాయిదా పడినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకులకు కొత్త సందేశాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు విక్రమ్ రెడ్డి ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించాడు. ఇటీవల, యువకుల కోసం ఒక ప్రదర్శన నిర్వహించబడింది మరియు వారి అభిప్రాయం మేకర్స్‌కు మరింత నమ్మకం కలిగించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ మరియు సృజన్ కుమార్ బొజ్జం నిర్మించారు. 

Latest News
 
'మట్కా' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి టైమ్ ఖారారు Mon, Sep 30, 2024, 07:42 PM
'స్వాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 30, 2024, 07:40 PM
బాడీకాన్ డ్రెస్ లో సమంత Mon, Sep 30, 2024, 07:35 PM
$5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన దేవర Mon, Sep 30, 2024, 07:31 PM
స్టైలిష్ అవుట్‌లుక్‌ లో రకుల్ ప్రీత్ సింగ్ Mon, Sep 30, 2024, 07:29 PM