UK బాక్సాఫీస్ వద్ద 'దేవర' సెన్సేషన్

by సూర్య | Mon, Sep 30, 2024, 03:58 PM

శివ కోరటాల దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ నటించిన యాక్షన్ డ్రామా "దేవర: పార్ట్ 1" సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో  ఒకటైన ఈ సిఎంమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాని UKలో డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ మరియు హంసిని ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసాయి. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా UK మరియు ఐర్లాండ్‌లో అత్యద్భుతమైన £440,131 గ్రాస్ ని వాసులు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ, ప్రేక్ష రాజ్, అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించారు.

Latest News
 
'మట్కా' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి టైమ్ ఖారారు Mon, Sep 30, 2024, 07:42 PM
'స్వాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 30, 2024, 07:40 PM
బాడీకాన్ డ్రెస్ లో సమంత Mon, Sep 30, 2024, 07:35 PM
$5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన దేవర Mon, Sep 30, 2024, 07:31 PM
స్టైలిష్ అవుట్‌లుక్‌ లో రకుల్ ప్రీత్ సింగ్ Mon, Sep 30, 2024, 07:29 PM