$4.5M మార్క్ ని చేరుకున్న 'దేవర' USA ప్రీమియర్ గ్రాస్

by సూర్య | Mon, Sep 30, 2024, 02:57 PM

శివ కోరటాల దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ నటించిన యాక్షన్ డ్రామా "దేవర: పార్ట్ 1" సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో  ఒకటైన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాని ఓవర్సీస్ లో ప్రత్యంగిర సినిమాస్ మరియు హంసిని ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసాయి. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ఉత్తర అమెరికాలో $4.5 మిలియన్‌ ప్రీమియర్ గ్రాస్ ని వాసులు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ, ప్రేక్ష రాజ్, అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించారు.

Latest News
 
ఆహాలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' Mon, Sep 30, 2024, 05:07 PM
'కాళీ' కోసం మెగా హీరో Mon, Sep 30, 2024, 04:57 PM
శ్రద్ధా శ్రీనాథ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'NBK109' టీమ్ Mon, Sep 30, 2024, 04:51 PM
USAలో $4.75M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Mon, Sep 30, 2024, 04:47 PM
నేడు విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' సెకండ్ సింగల్ Mon, Sep 30, 2024, 04:40 PM