'గేమ్ ఛేంజర్' సెకండ్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ ఖరారు

by సూర్య | Sat, Sep 28, 2024, 04:09 PM

శంకర్ షణ్ముగం దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీలో డిసెంబర్ 20, 2024న విడుదల కానుంది. మూవీ మేకర్స్ రెండవ సింగిల్‌కి రా మచా మచా (హిందీ వెర్షన్ దమ్ తు దిఖాజా) అని పేరు పెట్టారు. ఈ సాంగ్ ని థమన్ స్వరపరిచారు. రామ్ చరణ్‌ను అల్ట్రా స్టైలిష్ లుక్‌లో చూపించే సరికొత్త పోస్టర్‌ను టీమ్ తర్వాత వెల్లడించింది. ఈ సాంగ్ ప్రోమోను సెప్టెంబర్ 28, 2024న అంటే ఈరోజు సాయంత్రం 6:03 గంటలకి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర మరియు మరికొంతమంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Latest News
 
USAలో $4M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Sat, Sep 28, 2024, 08:37 PM
6M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'జనక అయితే గనక' ఫస్ట్ సింగల్ Sat, Sep 28, 2024, 08:32 PM
'స్వాగ్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Sat, Sep 28, 2024, 08:24 PM
గేమ్ ఛేంజర్ నుంచి ‘రా మచ్చా‘ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Sep 28, 2024, 08:22 PM
'హరి హర వీరమల్లు' కోసం పాట పాడనున్న పవన్? Sat, Sep 28, 2024, 08:17 PM