వాళై మూవీ తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌..ఎప్పుడు.. ఎక్కడ..?

by సూర్య | Wed, Sep 25, 2024, 09:17 PM

తమిళంలో ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చిన మంచి వసూళ్లు సాధించిన మూవీ వాళై (Vaazhai). గత నెల థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిల్డ్రన్స్ డ్రామా మూవీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి రాబోతోంది.


వాళై ఓటీటీ రిలీజ్ డేట్


తమిళ సినిమా వాళై ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజైంది. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 11 నుంచి తమిళం, తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ.. ఇలా మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఊహించని సక్సెస్ సాధించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది.


వాళై మూవీ గురించి..


వాళై మూవీని కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేసి ఆశ్చర్య పరిచింది. తమిళంలో వాళై అంటే అరటి పండు. ఇదొక పిల్లల డ్రామా మూవీ. 12 ఏళ్ల వయసున్న శివనందన్, అతని తల్లి, సోదరి, స్నేహితుడి చుట్టూ తిరుగుతుంది.


అరటి తోటనే నమ్ముకుని బతికే వీళ్లు తమ జీవితాల్లో ఎదుర్కొనే సవాళ్లను ఈ వాళై సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. గతంలో కర్ణన్, మామన్నన్ లాంటి హిట్ సినిమాలు అందించిన మారి సెల్వరాజ్.. ఈ వాళై మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తమిళ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.


హాట్‌స్టార్ లేటెస్ట్ మూవీస్డి


స్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మధ్య కాలంలో వివిధ భాషల సినిమాలను వరుసగా తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ వారంలోనే అలా మూడు సినిమాలు ఈ ఓటీటీలోకి వచ్చాయి.


హిందీలో ఈ ఏడాది రిలీజై మంచి హిట్ కొట్టిన కిల్, ముంజ్యాలాంటి సినిమాలతోపాటు మలయాళం హిట్ కామెడీ మూవీ వాజా కూడా ప్రస్తుతం హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వాళై అనే తమిళ హిట్ మూవీని కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

Latest News
 
వాళై మూవీ తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌..ఎప్పుడు.. ఎక్కడ..? Wed, Sep 25, 2024, 09:17 PM
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్ ప్రారంభం Wed, Sep 25, 2024, 09:11 PM
నేపాల్ లో 'జాక్' షూటింగ్ Wed, Sep 25, 2024, 09:08 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Wed, Sep 25, 2024, 09:05 PM
చెన్నైలోని కాందార్‌ నగర్‌ రోడ్డుకి ఎస్పీ బాలు పేరు Wed, Sep 25, 2024, 09:05 PM