హీరోయిన్ భావన భావోద్వేగ పోస్ట్

by సూర్య | Wed, Sep 25, 2024, 04:05 PM

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్ భావన మీనన్. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది.అప్పట్లో అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది భావన. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను మెప్పించింది. కానీ అనుహ్యంగా లకు దూరమయ్యింది ఈ బ్యూటీ. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే ల్లోకి రీఎంట్రీ ఇస్తున్న భావన.. తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్ భావన మీనన్. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది భావన. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను మెప్పించింది.కానీ అనుహ్యంగా లకు దూరమయ్యింది ఈ బ్యూటీ. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే ల్లోకి రీఎంట్రీ ఇస్తున్న భావన.. తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ అతడితో దిగిన ఫోటోను పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది భావన.


ఆమె తండ్రి మరణించి తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా "పోరాడుతూనే ఉండండి.. స్వర్గంలో ఉన్న వ్యక్తి మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. సమయం అన్ని గాయాలను నయం చేస్తుందని చాలా మంది అంటారు. కానీ అది నిజం కాదు" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.నాన్న... ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాం. గడిచే ప్రతి రోజు, ప్రతి ఒడిదుడుకుల్లో... మీరు ఎల్లప్పుడూ మా హృదయాల్లో ఉంటారు అని భావన పేర్కొంది. ఆమె తన నటనా జీవితంలో స్టార్‌కి అవసరమైన మద్దతునిచ్చింది ఆమె తండ్రి బాలచంద్ర. కానీ ఆమె తండ్రికి ఆకస్మాత్తుగా రక్తపోటు పెరగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రాణాలను కాపాడుకోలేకపోయారు.


తన తండ్రి మరణం వల్ల కలిగిన గాయం చనిపోయే వరకు ఉంటుందని గతంలో చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. భావన ప్రొడ్యూసర్ నవీన్ ను 22 జనవరి 2018 న ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఐదేళ్లు వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి బెంగుళూరులో స్థిరపడింది భావన.

Latest News
 
వాళై మూవీ తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌..ఎప్పుడు.. ఎక్కడ..? Wed, Sep 25, 2024, 09:17 PM
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్ ప్రారంభం Wed, Sep 25, 2024, 09:11 PM
నేపాల్ లో 'జాక్' షూటింగ్ Wed, Sep 25, 2024, 09:08 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Wed, Sep 25, 2024, 09:05 PM
చెన్నైలోని కాందార్‌ నగర్‌ రోడ్డుకి ఎస్పీ బాలు పేరు Wed, Sep 25, 2024, 09:05 PM