'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్

by సూర్య | Wed, Sep 25, 2024, 02:54 PM

వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రం సెప్టెంబరు 5, 2024న పలు భాషల్లో భారీ స్థాయిలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఎక్స్టెండెడ్ వెర్షన్ తో అక్టోబర్ 10న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రానున్న రోజులలో డిజిటల్ ప్లాట్ఫారం ఈ విషయాని అధికారకంగా ప్రకటించనుంది. ఈ థ్రిల్లర్ 2004 మాస్కో మెట్రో బాంబు దాడి నుండి ప్రేరణ పొందింది మరియు తీవ్రమైన రైడ్‌గా ఉన్నట్లు సమాచారం. ది గోట్ విజయ్ యొక్క 68వ చిత్రం. డి-ఏజింగ్ టెక్నాలజీ ద్వారా సాధించిన యువ వెర్షన్‌తో విజయ్ ఈ చిత్రంలో రెండు లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, జయరామ్, స్నేహ, లైలా, యోగి బాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మనోబాలా, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్ మరియు అరవింద్ ఆకాష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
వాళై మూవీ తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌..ఎప్పుడు.. ఎక్కడ..? Wed, Sep 25, 2024, 09:17 PM
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్ ప్రారంభం Wed, Sep 25, 2024, 09:11 PM
నేపాల్ లో 'జాక్' షూటింగ్ Wed, Sep 25, 2024, 09:08 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Wed, Sep 25, 2024, 09:05 PM
చెన్నైలోని కాందార్‌ నగర్‌ రోడ్డుకి ఎస్పీ బాలు పేరు Wed, Sep 25, 2024, 09:05 PM