'ధూమ్ ధామ్' నుండి టొమాటో బుగ్గల పిల్ల సాంగ్ మేకింగ్ వీడియో అవుట్

by సూర్య | Wed, Sep 25, 2024, 01:41 PM

తెలుగు నటుడు చేతన్ కృష్ణ సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో తన రాబోయే చిత్రం ధూమ్ ధామ్ తో అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో నటుడి సరసన హెబ్బా పటేల్ నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని టొమాటో బుగ్గల పిల్ల సాంగ్ మేకింగ్ వీడియోని విడుదల చేసినట్లు ప్రకటించారు. గోపి సుందర్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శ్రీ కృష్ణ మరియు గీత మాధురి గాత్రాలని అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై MS రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదలకి సిద్ధంగా ఉంది.

Latest News
 
వాళై మూవీ తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌..ఎప్పుడు.. ఎక్కడ..? Wed, Sep 25, 2024, 09:17 PM
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్ ప్రారంభం Wed, Sep 25, 2024, 09:11 PM
నేపాల్ లో 'జాక్' షూటింగ్ Wed, Sep 25, 2024, 09:08 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Wed, Sep 25, 2024, 09:05 PM
చెన్నైలోని కాందార్‌ నగర్‌ రోడ్డుకి ఎస్పీ బాలు పేరు Wed, Sep 25, 2024, 09:05 PM