'వెట్టయన్' తెలుగు వెర్షన్ ప్రివ్యూ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Wed, Sep 25, 2024, 01:25 PM

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టయాన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ యాక్షన్ డ్రామాలో లెజెండరీ నటుడు పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ని సృష్టించింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రివ్యూ వీడియోని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు తెలుగు వెర్షన్ ప్రివ్యూ ని ఈరోజు సాయంత్రం 5 గంటలకి విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సాంకేతిక సిబ్బందిలో సినిమాటోగ్రాఫర్ SR కతిర్ I.S.C మరియు ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. సూపర్ కాప్ థ్రిల్లర్ తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జిఎం సుందర్, రోహిణి, రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాని సంగీతం సమకూరుస్తున్నారు.   

Latest News
 
వాళై మూవీ తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌..ఎప్పుడు.. ఎక్కడ..? Wed, Sep 25, 2024, 09:17 PM
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్ ప్రారంభం Wed, Sep 25, 2024, 09:11 PM
నేపాల్ లో 'జాక్' షూటింగ్ Wed, Sep 25, 2024, 09:08 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Wed, Sep 25, 2024, 09:05 PM
చెన్నైలోని కాందార్‌ నగర్‌ రోడ్డుకి ఎస్పీ బాలు పేరు Wed, Sep 25, 2024, 09:05 PM