ఓపెన్ అయ్యిన 'దేవర' బుకింగ్స్

by సూర్య | Tue, Sep 24, 2024, 02:33 PM

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సాంగ్స్ మరియు ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'దేవర' బుకింగ్స్ Tue, Sep 24, 2024, 02:33 PM
నార్త్ అమెరికా బాక్స్ఆఫీస్ వద్ద $2.5M మార్క్ ని చేరుకున్న 'సరిపోదా శనివారం' Tue, Sep 24, 2024, 02:27 PM
'విశ్వం' సెకండ్ సింగల్ అవుట్ Tue, Sep 24, 2024, 02:24 PM
మా కష్టానికి ఫలితం దక్కింది: హీరోయిన్ ప్రతిభ Tue, Sep 24, 2024, 01:51 PM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను క్షమాపణలు కోరిన హీరో కార్తీ Tue, Sep 24, 2024, 01:45 PM