నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ కి సరిపోదా శనివారం

by సూర్య | Mon, Sep 23, 2024, 06:29 PM

నాని నుంచి ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'సరిపోదా శనివారం'. డీవీవీ దానయ్య - కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. కథాకథనాల పరంగా ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అదే రోజులలో వచ్చిన వరదల ప్రభావాన్ని ఈ సినిమా తప్పించుకోలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నాని జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ అలరించింది. ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య మెప్పించాడు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కోసం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోకి కోపం ఎక్కువ. 6 రోజులలో ఏం జరిగినా కోపాన్ని అణచుకుని, శనివారం నాడు దానిని ప్రదర్శించమని తల్లి చెబుతుంది. 6 రోజులలో అతని కోపం తగ్గిపోతే అవతలవారిని ఎప్పటికీ క్షమించమని అంటుంది. దాంతో హీరో తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని ఫిక్స్ చేసుకుంటాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనేది కథ.

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM