అభినందనలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన మెగాస్టార్

by సూర్య | Mon, Sep 23, 2024, 06:16 PM

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో చోటు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 150కి పైగా సినిమాల్లో అత్య‌ధిక డ్యాన్స్ స్టెప్పులతో అల‌రించినందుకు గాను ఆయ‌న‌కు ఈ అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తనకు అభినందనలు తెలియజేసిన వారికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.ఎక్స్ వేదికగా చిరు స్పందిస్తూ... "నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఏదో ఒకటి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. సంవత్సరాలుగా నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్క నిర్మాత, దర్శకుల వల్లనే ఇది సాధ్యమైంది. అద్భుతమైన పాటలను కంపోజ్ చేసిన సంగీత దర్శకులు, నాకు మరుపురాని డ్యాన్స్ మూవ్‌లను అందించిన కొరియోగ్రాఫర్‌లు, ఇన్నాళ్లూ నా పనిని మెచ్చుకున్న సినీ ప్రేక్షకులందరివల్లే ఇది సాధ్యమయింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన, నన్ను అభిమానించిన మిత్రులు, సహోద్యోగులు, నా ప్రియమైన అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, పెద్దలు, రాజకీయ, మీడియా ప్రముఖులు, పాత్రికేయులు, గౌరవ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు మరియు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజం ఏమిటంటే... మీకు కృతజ్ఞతలు తెలపడానికి నాకు మాటలు సరిపోవడం లేదు" అని ట్వీట్ చేశారు.

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM