'మత్తు వదలారా 2' వరల్డ్ వైడ్ లేటెస్ట్ కలెక్షన్స్

by సూర్య | Mon, Sep 23, 2024, 04:03 PM

శ్రీ సింహ కోడూరి మరియు సత్య నటించిన అత్యంత అంచనాల సీక్వెల్ 'మత్తు వదలారా 2' సెప్టెంబర్ 13న విడుదయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ ఉల్లాసకరమైన బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ఇ ప్పటికే అంతర్జాతీయంగా గణనీయమైన సంచలనాన్ని సృష్టించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన పది రోజులలో 30.1 కోట్లు వాసులు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి మరియు గుండు సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సారంగం మరియు ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ ఆర్ అందిస్తున్నారు.

Latest News
 
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM
'విశ్వంభర' టీజర్ విడుదల అప్పుడేనా? Mon, Sep 23, 2024, 07:28 PM